- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
by Shyam |

X
దిశ,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న షిఫ్ట్ కారు అన్నారం వై జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో బాలునితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
Next Story