- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బిహార్ సీఎం ప్రమాణస్వీకారానికి ‘తేజస్వి’ డుమ్మా..

X
దిశ, వెబ్‌డెస్క్ : బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు సంబంధించి సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు.సీఎం నితీష్‌తో పాటు మరో 14 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రతిపక్ష పార్టీ, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ మాత్రం సీఎంగా నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టనున్నారు. కాగా, తాను ఎందుకు హాజరు కాలేకపోతున్నాననే కారణాన్ని మాత్రం తేజస్వి వెల్లడించలేదు. ఇదిలాఉండగా, మొన్న జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల తేడాతో మహాఘట్భంధన్ కూటమి అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే.
Next Story