- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బిగ్ బాస్’ యూస్‌లెస్ షో.. డబ్బుల కోసమే చేశానన్న యాక్ట్రెస్
దిశ, సినిమా: యాక్ట్రెస్ రిమి సేన్ ‘బిగ్ బాస్’ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కొన్ని ఏళ్ల కిందట పార్టిసిపేట్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో యూజ్ లెస్ షో అని, కేవలం డబ్బుల కోసమే హౌజ్‌కు వెళ్లానని చెప్పింది. కాగా హిందీ బిగ్ బాస్ షో తొమ్మిదో సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్ కాంటెస్టెంట్‌గా ఆమె రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ షో గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించింది.
బిగ్ బాస్ షోలో పార్టిసిపేషన్ తనకు పెయిడ్ హాలీడేనని చెప్పిన భామ.. హౌజ్‌లోకి వెళ్లిన కొద్ది రోజులకు తనను మానసికంగా ఓ ఆట ఆడుకున్నారని చెప్పింది. హౌజ్‌లో టాస్క్‌లు చేయమంటూ పొద్దున 3 గంటల వరకు ఫ్రస్టేట్ చేసేవారని తెలిపింది. అయితే బిగ్ బాస్ తనకు మెచురిటీతో పాటు డబ్బులను ఇచ్చిందని పేర్కొంది. బిగ్ బాస్‌లో ఉన్నందుకు 49 రోజులు ఉన్నందుకు తనకు రూ.2.25 కోట్లు ఇచ్చారని ఆమె తెలిపింది. అతి తక్కువ సమయంలో ఇంత డబ్బులు సంపాదించడం కేవలం ‘బిగ్ బాస్’తోనే సాధ్యమని రిమి చెప్పడం విశేషం. రిమి.. బాలీవుడ్ హిట్ ఫిల్మ్స్ ‘ధూమ్, హంగామా, ఫిర్ హెరా ఫెరి’ చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. అయితే ఆయా సినిమాల్లో తనను ఫర్నిచర్‌లా వాడుకున్నారని ఆమె గతంలో కామెంట్ చేసిన విషయం విదితమే.