- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయెల్ – పాలస్తీనా సంఘర్షణ.. హృదయం ముక్కలవుతోంది : రిహన్నా
దిశ, సినిమా: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఖండిస్తున్నారు నెటిజన్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ హింసాత్మక ఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో పాప్ సింగర్ రిహన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఒపీనియన్ షేర్ చేసింది. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య చెలరేగుతున్న హింస తన హృదయం ముక్కలయ్యేలా చేసిందని చెప్పింది. ఈ పరిస్థితిని చూడలేకపోతున్నానన్న రిహన్నా.. అమాయకమైన ఇజ్రాయెల్-పాలస్తీనా పిల్లలు బాంబ్ షెల్టర్లలో దాక్కోవడం బాధ కలిగించిందని చెప్పింది. కేవలం గాజాలోనే 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇందులో 13 మంది చిన్నారులు ఉండటం మరింత ఆవేదనకు గురిచేస్తోందని చెప్పింది. దీనికి సరైన పరిష్కారం కావాలన్న రిహన్నా.. ఉగ్రవాదులు, ప్రభుత్వానికి మధ్య ప్రజలు నిరంతరం బలైపోతున్నారని ఈ పరిస్థితులు విచ్ఛిన్నం కావాలని సూచించారు.