బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్ చేయండి.. కోర్టుకెక్కిన రియా చక్రవర్తి

by Sumithra |   ( Updated:2021-11-10 03:53:31.0  )
బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్ చేయండి.. కోర్టుకెక్కిన రియా చక్రవర్తి
X

దిశ, సినిమా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సఫర్ అయిన విషయం తెలిసిందే. సుశాంత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న భామ.. చీటింగ్, దోపిడీతో పాటు డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కేసు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ పరిధిలోకి వెళ్లడంతో.. డ్రగ్స్ సిండికేట్‌లో రియా యాక్టివ్ మెంబర్‌గా ఉందంటూ తనతో పాటు ఆమె సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నెలరోజుల పాటు జైలులోనే గడిపిన తనకు ఆ తర్వాత ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు కారణంగా తన ఎకౌంట్స్‌ను ఎన్సీబీ పదినెలలుగా ఫ్రీజ్ చేయడంతో స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టును ఆశ్రయించిన భామ.. బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన కోర్టు.. రూ.10 లక్షల నష్టపరిహార బాండ్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఏజెన్సీ నుంచి లాప్‌టాప్, ఫోన్ తీసుకోవాలంటే స్పెషల్ ప్లీ దాఖలు చేయాలని సూచించింది.

ఆ హీరోయిన్ నిశ్చితార్థపు ఉంగరానికి రూ.2 కోట్లు

Advertisement

Next Story