- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జీఎంఆర్

దిశ,రామచంద్రాపురం : నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో 19 వ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ పుష్పానాగేష్ తో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం కార్పొరేటర్ పుష్పానాగేష్ మాట్లాడుతూ ఈ పథకాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఇందుకోసం లబ్ధిదారులు, రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ,తహశీల్దార్ సంగ్రామ్ రెడ్డి,రేషన్ షాప్ డీలర్స్ ప్రెసిడెంట్ ప్రకాష్,పర్సా శ్యామ్ రావు,స్థానిక నాయకులు మావిన్ గౌడ్,ఐలేష్ ఐలాపూర్,మహేందర్ రెడ్డి, మల్లేష్,కుమ్మరి రాజు,శాంతమ్మ,సుంకు స్వామి,రేషన్ డీలర్స్,స్థానిక నాయకులు. తదితరులు పాల్గొన్నారు.