అప్పుడు పనిగంటలు.. ఇప్పుడు సెలవులు.. సీఈఓ పోస్టుపై మండిపడుతున్న నెటిజన్లు

by D.Reddy |
అప్పుడు పనిగంటలు.. ఇప్పుడు సెలవులు.. సీఈఓ పోస్టుపై మండిపడుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో యువత 70 గంటల పాటు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆయనకు కొంతమంది మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక ఇప్పుడిప్పుడే పనిగంటలపై చర్చ మరుగునపడుతుందనుకుంటే.. తాజాగా మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. భారత్‌లో హాలిడే కల్చర్‌‌పై హైదరాబాద్‌కు చెందిన క్లీన్‌రూమ్స్ కంటైన్‌మెంట్స్ వ్యవస్థాపకులు & సీఈఓ రవికుమార్ తుమ్మలచర్ల (Ravikumar Tummalacherla) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా నెట్టింట ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

భారత్‌‌లో అనేక సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని, దాని వల్ల దేశ పురోగతి నెమ్మదిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, ఇతర సెలవుల వల్ల పనులకు ఆటంకం కలుగుతోందని, కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే 10 రోజులు సెలవులు వచ్చాయని అన్నాడు. దీంతో కార్యాలయాల్లో రికార్డులు పెండింగ్‌లో పడుతున్నాయని పేర్కొన్నాడు. చైనా మనకన్నా 60 ఏళ్లు ముందుందని, అక్కడ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారని రవికుమార్ రాసుకొచ్చారు. సెలవుల సంస్కృతిపై పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోడీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అయితే, ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారటంతో.. నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 'మనం యంత్రాలమా? భారత సంప్రదాయాలు, సంస్కృతి గొప్పతనం మీకు తెలుసా?' అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఇలాంటి పోస్టులు ఎప్పుడు యజమాని నుంచే వస్తాయని, ఉద్యోగి ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటాడు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed