రియా వీడియో వైరల్.. తెరపైకి మరిన్ని అనుమానాలు

by Shyam |
రియా వీడియో వైరల్.. తెరపైకి మరిన్ని అనుమానాలు
X

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. రియా వల్ల సుశాంత్ మెంటల్‌గా టార్చర్ అనుభవించాడని.. తన ఎకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిందని ఆరోపించాడు. దీంతో పాట్నా పోలీసులు విచారణ ముమ్మరం చేయగా.. కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది రియా. మరో వైపు సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండె సైతం రియాపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన ప్రవర్తనతో విసిగిపోయిన సుశాంత్.. రియాతో బ్రేకప్ చేసుకోవాలని 2019లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే కొత్తగా మరో వీడియో వెలుగులోకి రాగా, రియాపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ చానల్ బయటపెట్టిన వీడియోలో రియా సుశాంత్‌ను గూండా అని పిలిచింది. అంతేకాదు తనను చాలా సులభంగా హ్యాండిల్ చేయగలనని చెప్తుంది రియా. ఐతే రియా ఇది పాజిటివ్‌గా చెప్పిందో, నెగెటివ్‌గా చెప్పిందో తెలియదు కానీ, సుశాంత్ అభిమానులు మాత్రం చాలా ఫైర్‌తో ఉన్నారు. రియాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుతున్నారు.

Advertisement

Next Story