- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఎత్తివేతే నా లైఫ్‌లో బిగ్ డెసిషన్ అవుతుంది : ట్రంప్
వాషింగ్టన్: ప్రతీ విషయంలో దూకుడుగా.. ఒక్కోసారి వివాదాస్పదంగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో కరోనా విలయాన్ని చూస్తూ మెత్తబడినట్టు తెలుస్తున్నది. చిటికెలో ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకునే ఆయన ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంపైనే తన దృష్టినంతా కేటాయించారు. దీనికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలో లాక్‌డౌన్ సహా పలు ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేయాలనేది తనకు సవాలుగా మారిందన్నారు. ఇప్పటి వరకు తాను జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతి పెద్ద నిర్ణయం కాబోతోందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి సరైన సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. కోవిడ్-19పై నిపుణులు, సలహాదారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఈ విషయాలపై అధ్యయనం చేస్తోందని.. వారి సూచనల మేరకు ఆంక్షల ఎత్తివేత ఉంటుందని ట్రంప్ అన్నారు. కాని దీనికి ఎంత సమయం పడుతుందో మాత్రం ట్రంప్ చెప్పాలేదు. ప్రస్తుతం అమెరికాలో 95 శాతం ప్రజలు ఆంక్షల పరిధిలో ఉన్నారు.
Tags: america, lockdown, big decision, donald trump, announced, deaths, coronavirus, cases, surge