రెవెన్యూ పెండింగ్​ సమస్యలు క్లియర్

by Shyam |   ( Updated:2021-02-12 08:18:45.0  )
CS Somesh
X

దిశ, తెలంగాణ బ్యూరో: ​ రాష్ట్రంలో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు క్లియర్ చేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్​ గుర్తించారు. ధరణిలోని పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74,688 రాగా 62,847 దరఖాస్తులను కలెక్టర్లు పరిష్కరించారు. ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బీఆర్కే భవన్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంస్ధలకు, కంపెనీలకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉంచింది. ఎన్ఆర్ఐ మాడ్యూల్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సంస్ధలు, కంపెనీల పేర రిజిష్ట్రేషన్ మాడ్యూల్ అభివృద్ధి దశలో ఉందని ఈ నెల 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాల్లో మాడ్యూల్ వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు, వారిని గ్రామాల్లో పర్యటించాల్సిందిగా సీఎస్​ సోమేష్​కుమార్​ ఆదేశించారు.

ఈ టీంలు మాడ్యూల్స్ అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి సలహాలు ఇస్తుంది. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని, ముఖ్యంగా పార్ట్-బి లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రధ్ధ చూపించాలని ఆదేశించారు. సమావేశంలో సీఐజీ వి.శేషాద్రి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, టీఎస్టీఎస్​ఎండీ టి.వెంకటేశ్వర్ రావు, సీసీఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారద, రిటైర్డ్​ఐఏఎస్​బి.రామయ్య, సీసీఎల్ఏ ఓఎస్డీ సుందర్ అబ్నార్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story