- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాక ఫలితంపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌రావుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్లు రఘునందన్ విజయానికి సవాలక్ష కారణలున్నాయన్నారు. టీఆర్ఎస్‌లో రఘునందన్‌కు ఎవరు సహకరించారు ? నగదు, ఓట్లను ఎవరు బదిలీ చేశారో అందరికీ తెలుసన్నారు. ఇవాళ తెలంగాణ సమాజంలో కులం గెలిసింది కానీ.. ప్రజలు గెలవలేదని అంతా అనుకుంటున్నారని అన్నారు. గురువు ఆశీర్వాదం ఉందని తిరుపతిలో గుండు కొట్టించుకున్న రఘునందన్ ఏం చెప్పాడో అందరూ చూశారన్నారు. దుబ్బాకలో బీజేపీ రిజల్ట్ వన్ టైమ్ వండర్ మాత్రమేనని.. ఇలాంటి వన్ సైడ్ వండర్లు గతంలో చాలాసార్లు జరిగాయన్నారు.
2012లో మహబూబ్‌నగర్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి శ్రీనివాస్‌రెడ్డి గెలిచారు కానీ చివరకు ఏమైందన్నారు. 2014 నుంచి 2018 వరకు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 105 చోట్ల బీజేపీకి డిపాజిట్లు పోయి.. ఒక్క ఎమ్మెల్యే గెలిచారని గుర్తు చేశారు. 2019లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలకు బీజేపీ నుంచి నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏమీ చేయలేనివారు ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ నాటకాలను సమాజం గమనిస్తోందని సోమవారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు.