గ్రామాల్లో సౌకర్యాలపై తక్షణం స్పందించండి: ఈఓఆర్డీ లక్షయ్య

by Sridhar Babu |   ( Updated:2021-11-30 05:55:26.0  )
thimmampeta1
X

దిశ, ములకలపల్లి: గ్రామాల్లో నెలకొన్న అసౌకర్యాలపై తక్షణమే స్పందించాలని ఈఓఆర్డీ లక్షయ్య సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని తిమ్మంపేట పంచాయితీని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గ్రామం అంతా కలియతిరిగి నేరుగా ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడి అధికారుల పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్ గౌరి లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి రాంబాబుతో కలిసి డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను సందర్శించారు. స్థానిక అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందుతున్న తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story