- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి :తలసాని
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యలను పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్ నేతాజీనగర్‌లో రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, శంకర్ యాదవ్, జీహెచ్ఎంసీ, జలమండలి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. తమ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు మంత్రిని కోరగా.. జోనల్ కమిషనర్‌కు దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం నేతాజీ నగర్ నుంచి బాంబే బార్ వరకు ఉన్న నాలాతో పాటు బేగంబజార్ నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు. బేగంబజార్ నాలా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని.. మిగిలిన ఆక్రమణలు వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.