- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాటలతో మనసుకు ఆహ్లాదం… ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి భావోద్వేగానికి ఒక పాట ఉంటుంది. కొన్ని పాటలు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని పాటలు బాధను కలిగిస్తాయి. ఇక కొన్ని పాటలు విన్నపుడు మాత్రం లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అలాగే ఒక ప్రత్యేకమైన పాట విన్నపుడు మనం అందులో ఉద్వేగాన్ని ఎందుకు ఫీలవుతామనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం దొరికింది.
విటెర్బీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ యూఎస్సీ వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పాటలు మనిషి మెదడును, శరీరాన్ని, భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కనుక్కున్నారు. ఈ పరిశోధనలో ఒక్కో రకమైన ఆడియో ఫీచర్లు, శరీరంలో ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా ప్రభావితం చేస్తాయని వారు కనిపెట్టారు.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పీహెచ్‌డీ విద్యార్థి టిమ్ గ్రీర్ ఈ పరిశోధన ద్వారా ఏ సంగీతం వింటే ఏ భాగం ప్రభావితమవుతుందో తెలుసుకుని అందుకు తగినట్లుగా మెదడు ఎలా పనిచేస్తుందో కనిపెట్టే అవకాశముందని తెలిపారు. అలాగే చర్మ కణాలను ప్రభావితం చేసే సంగీతం గురించి పరిశోధించడం వల్ల మ్యూజిక్ కార్యక్రమాలకు వెళ్లే ఆడియన్స్‌ను ఉత్తేజపరచగల సంగీతం సృష్టించవచ్చని వెల్లడించారు.
పరిశోధన ఎలా సాగింది?
ఈ పరిశోధనలో 120 రకాల ఆనందకర, బాధాకర పదాలను ఎంచుకుని వాటిని పాటరూపంలో 8 మందికి వినిపించారు. వారి విభజన ప్రకారం అవే పాటలను మరో 82 మందికి వినిపించి, వాటిని ఆనందకర పాట, బాధాకర పాట, అత్యంత బాధాకర పాటలుగా విడగొట్టారు. తర్వాత ఒక్కోపాటను 40 మందికి రెండు సార్లు వినిపించి వారి మెదడు స్పందనలను ఎఫ్ఎంఆర్ఐ స్కానర్ ద్వారా రికార్డు చేశారు. అలాగే భౌతిక స్పందనల కోసం మరో 60 మందికి వీటిని వినిపించారు. అప్పుడు వారి హృదయ స్పందన, చర్మ స్పందనలను నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా తాము ప్రతి పాట నుంచి 74 రకాల ఆడియో ఫీచర్లను బయటకు తీసి, మెషీన్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా స్పందనలను అంచనా వేసినట్లు గ్రీర్ వివరించారు.
ఈ పరిశోధన ప్రాముఖ్యత ఏంటి?
ఈ అధ్యయనం వల్ల శాస్త్రోక్తమైన సంగీత పరిజ్ఞానం పెంచుకోవచ్చు. అలాగే ఆడియెన్స్‌కి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి పాటలను మ్యూజిక్ డైరెక్టర్లు రూపొందించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఏ మ్యూజిక్ వల్ల ఏ శరీర భాగం ప్రభావితమవుతుందో తెలిస్తే మ్యూజిక్ థెరపీ ద్వారా వివిధ జబ్బులను నయం చేసే అవకాశం కలుగుతుందని పరిశోధకులు వివరించారు.