- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీరుట్ ఓడరేవులో మంటలు..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్ రాజధాని బీరుట్ ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెస్య్కూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీరుట్ డ్యూటీ ఫ్రీజోన్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, బీరుట్ నౌకాశ్రయంలో పేలుడు సంభవించిన నెలరోజుల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెలలో జరిగిన పేలుడులో 200మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story