- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వినోద్‌కుమార్‌ను కలిసిన ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు
దిశ, తెలంగాణ బ్యూరో: తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకురాలు, ఉమ్మడి రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా, తొలి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన టి.ఎన్.సదాలక్ష్మీ విగ్రహాన్ని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ఎదుట ఏర్పాటు చేయాలని నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను కోరారు. సోమవారం మంత్రుల అధికారిక నివాసంలో వారు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. దళిత వర్గానికి చెందిన సదాలక్ష్మి.. రాష్ట్ర ఆవిర్భావం కోసం 1969లో ఉద్యమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన సదాలక్ష్మీ సాంఘీక సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఉద్యమ కాలంలో మర్రి చెన్నారెడ్డి జైలుకు వెళ్ళిన సందర్భంలో సదాలక్ష్మీ తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఉద్యమాన్ని బలోపేతం చేశారని, 10ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారని వారు వివరించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ తెలిపారు.