- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో 26,778 మెడికల్ పోస్టుల భర్తీ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య రంగంలో నూతన నియామకాలను చేపట్టింది. వారం రోజుల్లోగా 26,778 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటన్నింటినీ ఆగస్టు 5లోగా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
గురువారం నుంచే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోవాలని సూచించింది. మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లతోపాటు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 26,778 మందిని నియమించనున్నారు. ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలుంటాయి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన రోజే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12గంటల కల్లా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు ఎంపికైనవారి వివరాలు పంపాల్సిందిగా సూచించింది.