పోలింగ్ సీన్ రిపీట్.. లెక్కింపులోనూ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

by Sridhar Babu |
పోలింగ్ సీన్ రిపీట్.. లెక్కింపులోనూ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోలింగ్ సీన్ రిపీటైంది. అధికార పార్టీ నేతలతో పాటు పలువురు, అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పలువురు మాస్కులు ధరించకుండానే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి రావడం పరిపాటిగా మారింది. లెక్కింపు సమయంలో అంతంత మాత్రంగానే ఉన్న అధికార పార్టీ నాయకులు, అభ్యర్థుల గెలుపును ప్రకటించగానే వందల సంఖ్యలో అక్కడకు చేరుకొని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుట భారీ ఎత్తున నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి మంత్రి గంగుల కమలాకర్ వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. పోలీసులు అడ్డుకుంటున్నా.. వారిని తోసుకుంటూ లోనికి చొచ్చుకెళ్లారు.

కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి లెక్కింపు కేంద్రం పరిసరాల్లో హల్‌చల్ చేశారు. అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేశారు. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎల్.రమణ గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు లెక్కింపు కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని మంత్రి గంగులతో కలిసి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed