- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బద్రి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్
దిశ వెబ్ డెస్క్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో…పవన్ కల్యాణ్ హీరోగా, రేణు దేశాయ్, అమీషా పటేల్ లు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘బద్రి’. ఈ చిత్రం విడుదలై ఏప్రిల్ 20 నాటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇదే సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన రేణు.. బద్రితో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. ‘బద్రి’ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా.. ఆ సినిమా జ్ఞాపకాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా గుర్తు చేసుకున్నారు రేణు. ఆ నాటి షూటింగ్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకుడిగా, రేణు దేశాయ్ , అమిషా పటేల్ లు హీరోయిన్లుగా.. ‘బద్రి’ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. బద్రిగా పవన్ నటన, స్టైల్, మేనరిజం, డైలాగ్ డెలీవరీ అన్నీ సినిమాకు హైలెట్. తొలి సినిమాతోనే పూరి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత వరస అవకాశాలతో దూసుకెళ్లాడు. ఇక ఈ చిత్రంతోనే పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘జానీ’ చిత్రం మాత్రమే చేశారు. ఇక బద్రి నాటి సంగతులను రేణు దేశాయ్ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫోటోలను జత చేస్తూ.. అక్కడ జరిగిన సంభాషణలను, షూటింగ్ ముచ్చట్లను పంచుకుంది.
‘మేము మారుమూల ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో కూర్చొవడానికి కుర్చీలు కూడా లేవు. ఆ టైమ్ లో నేను షార్ట్ స్కర్ట్ ధరించాను. దాని వల్ల రాయిపై కూర్చోలేకపోయాను. ఓ అమ్మాయి పక్కన నిలబడి ఉండగా.. మీరు ఇలా కూర్చోవడం మ్యానర్స్ కాదని .. కల్యాణ్ గారి తో సరాదాగా అన్నాను. అంతేకాదు అక్కడ బలమైన గాలులు వీస్తుండటంతో.. నిలబడ్డానికి, డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను’ అంటూ ఓ ఫోటో తో పాటు .. ఆ సంగతులను షేర్ చేసింది.
‘కల్యాణ్ గారు ఏ చికితా పాటలో తన పార్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ప్యాకప్ చెప్పారు. ఆ సమయంలో నేను ‘వరమంటే’సాంగ్ పూర్తిచేశాను. ఆరోజు కాస్త ఎండ ఎక్కువగా ఉండటం, లోకేషన్ లో చాలా దూరం నడవడంతో మేము చాలా అలసిపోయాం. ఆకలి, నీరసంతో మేమిద్దరం ప్రపంచాన్ని మరచిపోయాం.’ అంటూ ఇంకో ఫోటో షేర్ చేసుకున్నారు.
‘సేమ్ లోకేషన్.. కానీ మరో రోజు షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో. ఇది జరిగి 20 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ టైమ్ మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీయడం నాకు సంతోషాన్నిచ్చింది.’అని రేణు గుర్తుచేస్తుకున్నారు.
tags :renu desai, pawan kalyan, puri, amisha patel, badri