- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
దిశ, పాలేరు: రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిందుతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. హైదరాబాదు నుండి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఖమ్మం జిల్లా సరిహద్దులో అదుపులోకి తీసుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.నిందుతుల నుండి ఐదు రెమ్డెసివిర్ వైల్స్ స్వాధీనం చేసుకున్నారు.కరోనా రోగుల అత్యవసర వైద్యం కోసం వాడే ఈ రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాను కట్టడి చేసేందుకు దృష్టి సారించిన జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ టాస్క్ ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపి దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల హైదరాబాదు నుంచి అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం , ఎస్సై ప్రసాద్, తమ సిబ్బందితో ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద నిఘా వేసి పట్టుకున్నారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న ఐదు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను పట్టుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వివరాలను వెల్లడించారు.పధకం ప్రకారం ఒక్కొక్క ఇంజెక్షన్ 32 వేలకు కొవిడ్ బాధితులకు విక్రయించేందుకు ఘట్కేసరి మండలం నారాపల్లి గ్రామానికి చెందిన
నల్లెదా తిరుమల్ రెడ్డి అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లో ఉన్న మెడికల్ షాప్ లో ఐదు రెమ్డెసివిర్ వైల్స్ ను తీసుకొని ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రి పిఆర్వోగా పనిచేస్తున్న అకారాపు నిరంజన్ కు ఖమ్మం సరిహద్దులో అప్పగించేందుకు AP10 BG 1113 నెంబరు గల తన కారులో హైదరాబాదు నుండి బయలుదేరి ఖమ్మం జిల్లా సరిహద్దుకు చేరుకొని అకారాపు నిరంజన్ కు అప్పగిస్తున్న తరుణంలో దాడిచేసి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. నిందుతులను అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల నిమిత్తం కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు