- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ అమ్మకం..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాధి నివారణ చికిత్సలో ఉపయోగించే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్‌ను బ్లాక్‌లో అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ మెడిసిన్ ‘వైల్’ మెడికల్ షాపుల్లో రూ. 5,400లకు లభిస్తుండగా.. వీరు రూ. 30వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముంబై పట్టణంలో రెండు చోట్ల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడుల్లో ఈ మెడిసిన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. మఫ్టీలో ఇద్దరు పోలీసులను పంపి.. ఈ డ్రగ్ అమ్మకం గుట్టు రట్టు చేశారు. అలాగే, ఈ మందును తయారు చేస్తున్న డెల్ఫా ఫార్మస్యూటికల్స్ అనే సంస్థకు చెందిన అయిదుగురిని, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎవరైనా బయట బ్లాక్‌లో కరోనా మెడిసిన్ విక్రయిస్తే వారి గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.