- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూ. 551 కోట్ల భారీ నిధులను సేకరించనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రా!

దిశ, వెబ్‌డెస్క్: ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన వాటాల జారీ ద్వారా రూ. 550.56 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు తమ వాటాదారుల నుంచి ఆమోదం లభించినట్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బుధవారం తెలిపింది. సేకరించిన నిధులను దీర్ఘకాలిక వనరులకు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, భవిష్యత్తు సంస్థ వృద్ధికి వినియోగించనున్నట్టు కంపెనీ తన రెగ్యులేటరీ ఫలింగ్‌లో తెలిపింది. 8.8కోట్లషేర్లను వీఎఫ్ఎస్ఐ హోల్డింగ్స్ లిమిటెడ్‌కి ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్, వారెంట్స్ ద్వారా కేటాయిస్తామని తద్వారా ఈ నిధులు సేకరించనున్నట్టు కంపెనీ వివరించింది. దీంతో పాటు ఫారిన్ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా 24 శాతం ఈక్విటీ షేర్ల జారీ కోసం రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థ బోర్డు అనుమతి తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో సంస్థకు భారీగా నిధులు సమకూరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రా దేశీయ అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థలలో ఒకటి. వివిధ ప్రత్యేక ప్రయోజనాల ద్వారా ప్రజెక్టులను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది.