ఏపీలో ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల

by srinivas |
Results4
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి సురేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఇకపోతే సెప్టెంబర్‌ 26న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. తక్కువ సమయంలో ఫలితాలు వెలువడటం చరిత్ర అంటూ మంత్రి సురేశ్ అన్నారు. ఇకపోతే ఈ ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఎం. గుణశేఖర్‌ మెుదటి స్థానంలో నిలిచారు. అలాగే శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా), ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా), వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ జిల్లా), జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. మెుదటి ఐదు స్థానాల్లో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఇకపోతే ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో మెుత్తం 4,400 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story