- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘చాలా వెనుకబడి ఉన్నాం’.. వారి పనితీరుపై మీనాక్షి నటరాజన్ అసంతృత్తి

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు చాలా యాక్టీవ్ఉండి.. కీ రోల్ప్రదర్శించాలని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు వెంకటస్వామిలతో కలిసి విద్యార్థి నాయకులతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తొలుత విద్యార్థి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే, కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై విద్యార్థుల నాయకులతో ఆరా తీశారు. ప్రతిపక్ష పార్టీ విద్యార్థి నేతల సోషల్మీడియా ప్రచారంలో ఉన్నట్టుగా కాంగ్రెస్అనుబంధ విద్యార్ధి నాయకుల తీరుపై ఆమె అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నప్పటికీ యూత్ ప్రభుత్వ పథకాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయాన్ని విద్యార్థి నాయకులతో ఆమె వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు ఎందుకు వెనకబడి ఉన్నాం... ఎలాగైతే సక్సెస్ఫుల్గా గెయిన్అవుతామో చెప్పాలని వారితో చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో యూత్ అగ్రెసివ్ గా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ దృష్టి సారించాలని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ప్రభుత్వం ఉండి.. అభివృద్ధి సంక్షేమ, కార్యక్రమాలు చేపడుతన్న వాటిపై ప్రజల్లోకి వెళ్లాలని, ఇందుకోసం విద్యార్థులు సైనికులుగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే, సోషల్మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు దీటుగా తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా చరుకుగా ఉండాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. కాగా, రేపు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటి కానున్నారు.