రబీ పంటల సాగు కోసం నిజాంసాగర్ నీటి విడుదల : హన్మంత్ షిండే

by Aamani |
రబీ పంటల సాగు కోసం నిజాంసాగర్ నీటి విడుదల : హన్మంత్ షిండే
X

దిశ, నిజాంసాగర్ : నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రబీ పంటల సాగు కోసం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఒక వెయ్యి క్యూసెక్కుల నీటిని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ దఫేదార్ రాజు‌లు నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి గేట్ల ద్వారా ప్రధాన కాలువ లోకి నీటిని మళ్లించారు.

అనంతరం జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ఖరీఫ్ పంటల సాగు కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని రైతులు సకాలంలో పంటలు వేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని చేతులెత్తేసిందని దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విధంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ వేసవికాలంలో ఆరుతడి పంటలను సాగు చేసుకొవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గారెడ్డి, గంగారెడ్డి విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed