- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే లుక్‌తో రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బడ్జెట్ రేంజ్‌లో సంచలనం రేపుతున్న చైనా బ్రాండ్ రెడ్‌మీ సరికొత్త మోడళ్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ అనుబంధ బ్రాండ్‌గా వస్తున్న రెడ్మీ సిరీస్‌లో సరికొత్త రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్, రెడ్‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రత్యేకతలను, ధరలను గురువారం జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
రెడ్‌మీ నోట్ 9 ప్రో:
రెడ్‌మీ నోట్ 9 ప్రో మిడ్ రేంజ్ విభాగంలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చే దీని ధర రూ. 12,999 ఉంటుంది. అలాగే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఫోన్ ధర రూ. 15,999కి లభించనుంది. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తోంది. ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 720జీని ఉపయోగించారు. రియర్ కెమెరా 48 మెగాపిక్సల్స్ ఉండగా, సెల్ఫీ 16 మెగాపిక్సల్ ఉండనుంది. 5020 బ్యాటరీ సామర్థ్యంతోపాటు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్:
స్టైలిష్‌గా వస్తున్న రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఇందులో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో రూ. 14,999కే లభిస్తుంది. ఇందులోనే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 16,999కి, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ. 18,999కి లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కూడా 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. ప్రాసెసర్ కూడా రెండింటికీ ఒకటే ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాలుగు కెమెరాలు ఉండటం ప్రత్యేకతగా నిలుస్తుంది. 64 మెగాపిక్సల్స్ ప్రైమరీ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సల్స్ ఆల్ట్రావైడ్ యాంగిల్, 5 మెగాపిక్సల్స్ మైక్రో లెన్స్, 2 మెగాపిక్సల్స్ డెప్త్ సెన్సార్‌లను ఈ ఫోన్ కలిగి ఉంది. అలాగే, సెల్ఫీ కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 5020 ఎమ్‌హెచ్ఏ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఈ నెల 17 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మార్చి 25 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లపై ఆఫర్లను 16న ప్రకటించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది.