- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియల్టీలో పెద్ద ఇళ్లకు భారీ డిమాండ్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి కారణంగా మారిన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులొచ్చాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ఇటీవల చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వచ్చే ఏడాది సగం వరకు ఇచ్చాయి. మరికొన్ని కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. దీంతో రియల్టీలో పెద్ద సముదాయాలను తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అయితే, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ.. గత కొంత కాలంలో పెద్ద ఇళ్లకు, పెద్ద సముదాయాలకు భారీగా డిమాండ్ పెరిగిందని అనరాక్ వెల్లడించింది.
మల్టీ ఫంక్షనల్ సముదాయాలను చాలామంది ఎంపిక చేసుకుంటున్నారని, ఇది ఉద్యోగులకు సరైన భద్రతతో కూడిన పని ప్రదేశాన్ని ఇవ్వడానికి అవకాశముంటుందని కంపెనీల యజమానులు భావిస్తున్నట్టు అనరాక్ తెలిపింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులు సైతం తాము నివసించేందుకు పెద్ద ఇళ్లను చూస్తున్నట్టు అనరాక్ నివేదికలో స్పష్టమైంది. నగరాల్లో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను, అదనపు ఖర్చుతో లభించే పెద్ద ఇళ్లను కూడా కొనేందుకు ఈమధ్య పోటీ పెరిగిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్నొక పెట్టుబడి సాధనంగా ఎక్కువమంది చూస్తున్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమారు చెప్పారు.
అలాగే, డెవలపర్లు కూడా కొత్త అవసరాలను వినియోగదారులకు సూచిస్తున్నారు. కొవిడ్-19 పరిస్థితి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగింది. దీంతో కొత్త ప్రాజెక్టులు సాధారణం కంటే అదనంగా స్థలాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు హీరానందాని గ్రూప్ ఎండీ, వ్యవస్థాపకుడు డాక్టర్ నిరంజన్ హీరానందాని చెప్పారు.