బీజేపీతో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు

by Shyam |
బీజేపీతో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో బీజేపీ కారణంగా రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు వచ్చిందని టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్.సి.కుంతియా విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలను కూల్చి వేస్తుందని మండిపడ్డారు. సొంత పార్టీ సభ్యుల బలం లేకుండానే అధికారపక్ష సభ్యులను తమ వైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. కరోనాతో దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో బీజేపీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు.

ఇప్పుడు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందని, రాజస్థాన్ ముఖ్యమంత్రి, మంత్రివర్గం అసెంబ్లీ సమావేశంలో బలనిరూపణ చేసుకోవడానికి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం నిర్ణయం మేరకు గవర్నర్ నడుచుకోవాలని హితవు పలికారు. వెంటనే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సంఖ్యా బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కుంతియా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story