మ్యూచువల్ ఫండ్‌లకు ఆర్‌బీఐ ప్యాకేజీ!

by Harish |
మ్యూచువల్ ఫండ్‌లకు ఆర్‌బీఐ ప్యాకేజీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోమవారం ఉదయం కొవిడ్-19 వల్ల నష్టాలను తగ్గించేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు రూ. 50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని ఇవ్వనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. సోమవారం నుంచి మే 11 వరకూ ఈ సదుపాయం ఉంటుందని వివరించింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు తద్వారా కరోనా వైరస్, లాక్‌డౌన్ ఆంక్షల నష్టాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నిర్ణీత రెపో రేటుతో ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యం-మ్యూచువల్ ఫండ్స్ కింద 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలు ఆర్‌బీఐ నిర్వహించనుంది. సోమవారం నుంచి మే 11 వరకూ దీనికి అనుమతి ఉంటుంది. సంబంధిత నిధులను పొందడానికి శుక్రవారం వరకూ బిడ్లను సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఆర్థి స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ సానుకూలంగా స్పందించాయి.

Tags : mutual funds, RBI, Reserve Bank of India, MF

Advertisement

Next Story