- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీడ్ పెంచిన ‘కిక్’ వచ్చేనా?
మాస్ మహరాజ్ రవితేజ.. ప్రస్తుతం మాస్ కాదు కదా, క్లాస్‌ను కూడా మెప్పించలేక పోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడనుకుంటే..మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. ఇలీవలే వచ్చిన డిస్కోరాజాతో కలిపి వరుసగా మూడు డిజాస్టర్లతో కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకున్నాడు. ఈ దెబ్బకు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న F3 మూవీలోనూ ఛాన్స్ పోగొట్టుకున్నాడని, ముందుగా వెంకీ, వరుణ్‌లతో పాటు రవితేజను కూడా హీరోగా అనుకున్నా నిర్మాత దిల్ రాజు అందుకు ఒప్పుకోలేదని చాలా వార్తలు వచ్చాయ్.
అయితే క్రాక్ సినిమాతో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న రవితేజ..మరో కిరాక్ ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడని టాక్. హలో గురూ ప్రేమ కోసమే డైరెక్టర్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో మరో మూవీ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం. స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఎంతో మంది హీరోలను కలిసినా..త్రినాధరావుకు ఎక్కడా కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. కథ బాగుండటంతో చివరికి రవితేజ తనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా..ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేసే యోచనలో ఉన్నారట ఈ మూవీ మేకర్స్.