ఆర్గాన్ డొనేషన్.. లైఫ్ సెలబ్రేషన్ : రవీనా

by  |
ఆర్గాన్ డొనేషన్.. లైఫ్ సెలబ్రేషన్ : రవీనా
X

బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఆర్గాన్ డొనేషన్ ( అవయవదానం)కు పిలుపునిచ్చింది. భారత్‌లో లక్షలాది మంది అవయవాలు అందుబాటులో లేక చనిపోతున్నారన్న ఆమె.. వారిని కాపాడుకునేందుకు మన వంతు కృషి చేయాలన్నారు. ఇండియాలో ఆర్గాన్ డొనేషన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉందని.. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సహాయం అందించాలని కోరారు. ఆర్గాన్ డొనేషన్‌ను లైఫ్ సెలబ్రేషన్‌గా అభివర్ణించిన రవీనా.. సరి కొత్త స్ఫూర్తిని పంచే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ.. ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన మోహన్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది. సాటి మనిషి జీవితాన్ని నిలబెట్టే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని అభిమానులను కోరింది.



Next Story

Most Viewed