అనుమానం రాదనుకుంటే.. పట్టుకున్నారు

by Anukaran |
అనుమానం రాదనుకుంటే.. పట్టుకున్నారు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మర వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తవుడు రవాణా మాటున రేషన్ బియ్యాన్ని ఖమ్మం నుంచి కోదాడ మీదుగా ఏలూరుకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివరాలను ఎస్సై రామాంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story