- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెల్‌కమ్ బ్యాక్.. ఎయిర్ ఇండియా కొనుగోలుపై రతన్ టాటా ఏమన్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్స్ దక్కించుకోవడంపై ఆ సంస్థ అధినేత రతన్ టాటా ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహించిన ఓపెన్ బిడ్డింగ్‌లో ఎయిర్ ఇండియా కంపెనీని టాటా సన్స్ రూ.18 వేల కోట్లకు దక్కించుకున్నట్టు కేంద్రం శుక్రవారం అధికారంగా ప్రకటన చేసింది. ఈ సందర్భంగా రతన్ టాటా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
‘వెల్ కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా’ అని రతన్ టాటా ట్విట్టర్‌లో ఒక పిక్చర్‌ను పోస్టు చేశారు. అందులో జేఆర్‌డీ టాటా ఎయిర్ ఇండియా విమానం దిగి నడుస్తూ, అభివాదం చేస్తూ వస్తున్నట్టు కనిపిస్తోంది. దానిపై ఓ సందేశం కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను తిరిగి పునర్ నిర్మిస్తామన్నారు. టాటా కంపెనీ సివిల్ ఏవియేషన్ విభాగంలో పటిష్టంగా ఉన్నందున ఎయిర్ ఇండియాకు బలమైన మార్కెట్ వాల్యూ ఏర్పడే అవకాశముందన్నారు.
అంతేకాకుండా, ఆనాడు జేఆర్‌డీ టాటా గారి నేతృత్వంలో ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే పేరుగాంచిన ఎయిర్ లైన్స్‌గా ప్రసిద్ధికెక్కిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తమకు మరో అవకాశం వచ్చిందని, ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం జేఆర్‌డీ టాటా మన మధ్యలో ఉండి ఉంటే ఈ విషయం తెలిసి ఎంతో ఆనందించేవారని చెప్పారు.
కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ఇవ్వాలన్న కేంద్రం పాలసీని తాము కూడా గుర్తించాల్సిన అవశ్యకత ఎంతో ఉందని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రతన్ టాటా స్పష్టంచేశారు.