- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక ‘పొగరు’తో ఆందోళనకు దిగిన మతపెద్దలు
దిశ, సినిమా : హీరోయిన్ రష్మిక మందన, హీరో ధృవ సర్జా జంటగా తెరకెక్కిన కన్నడ మూవీ ‘పొగరు’ ఫిబ్రవరి 19న రిలీజైంది. మంచి ఓపెనింగ్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర గ్రేట్ రన్‌తో దూసుకెళ్తోంది. కానీ ఇంతలోనే ఎదురైన ఓ వివాదం సినిమాను చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రంలోని ఒక కాంట్రవర్షియల్ సీన్ తమ రిలీజియన్ సెంటిమెంట్స్‌ను దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని సంబంధిత మతపెద్దలు డిమాండ్ చేశారు.
ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో పూజారి భుజంపై రౌడీలు కాలు పెట్టే సీన్‌ను వెంటనే డిలీట్ చేయాలన్నారు. సినిమా ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారని దర్శక, నిర్మాతలను ప్రశ్నించిన బ్రాహ్మిణ్ కమ్యూనిటీ లీడర్స్.. ఈ చిత్రం యువతను తప్పుదారి పట్టించేలా ఉందన్నారు. ఒకవేళ తమ డిమాండ్లకు తలొగ్గకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
POGARUU 💪🏼Thanks to Karnataka 🙏 Jai Hanuman 🙏 pic.twitter.com/Txj4GWcMJr
— Dhruva Sarja (@DhruvaSarja) February 22, 2021