- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ నటి బయోపిక్ చేస్తా.. అలాగే ఉంటాగా : రష్మిక
by Shyam |

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న భామ.. అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఈ క్రమంలో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న భామ.. బయోపిక్ చేస్తే ఎవరిని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నపై స్పందించింది. అందాల నటి సౌందర్య జీవితకథ ఆధారంగా మూవీ చేయాలని ఉందని చెప్పింది. వండర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ లుక్స్‌తో దక్షిణాది అభిమానుల మనసులో చెరగని ముద్రవేసిన సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి ఎంటర్ కాక ముందు తండ్రి తనను సౌందర్యతో పోల్చేవారని, తనలాగే ఉంటానని చెప్పేవారని తెలిపింది. అందుకే అలాంటి గొప్పనటి బయోపిక్ చేయాలనుకుంటున్నట్లు వివరించింది.
- Tags
- Biopic
Next Story