- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్తుమందు కలిపి తల్లీకూతురిపై…
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీ సుందరయ్య నగర్‌లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఇంటి యజమాని, అతని మిత్రులు మంగళవారం మధ్యాహ్నం పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. చికెన్ కర్రీ వండి ఇవ్వాలని ఇంట్లో రెంట్ కు ఉండే మహిళను కోరడంతో ఆమె తయారు చేసి ఇచ్చింది. పార్టీ అయిపోయాక మిగిలిన కర్రీని ఆ మహిళకు ఇచ్చాడు. అయితే ఆ చికెన్ కర్రీలో మత్తు మందు కలిపి యజమాని, అతని ఇద్దరు స్నేహితులు కలిసి.. నాపై, తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు… వైద్య పరీక్షల నిమిత్తం మహిళను ఉస్మానియాకు, బాలికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు వచ్చాకా.. అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.