- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యాచార నిందితుడి అరెస్టు
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
– బాధితురాలికి బీజేపీ నేతల పరామర్శ
దిశ, హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో రెండు రోజుల క్రితం దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని అరెస్టు చేసి ‘పోక్సో’, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక కుటుంబాన్ని బీజేపీ నగర నేతలు గురువారం పరామర్శించారు. అయితే సదరు నిందితుడు ఎంఐఎం పార్టీకి చెందినవాడన్న వార్త వెలుగుచూడటంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. దళితులు, మైనార్టీలు ఒక్కటేనని దేశమంతా తిరుగుతూ ప్రసంగించే ఓవైసీ.. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు ఎంఐఎం కార్యకర్త కావడంవల్లనే ఒవైసీ ఈ సంఘటనపై స్పందించడంలేదని విమర్శించారు. పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి సత్వరం న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంచందర్ రావుతో పాటు మాజీ మంత్రి విజయరామారావు, బండారు శృతి, భగవంత్ రావు తదితరులు ఉన్నారు.
నేడు డీవీఎంసీ సభ్యులు పరామర్శ
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన నేపథ్యంలో వివరాలు తెప్పించుకున్న హైదరాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అ్రటాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బత్తుల రాంప్రసాద్, ఎల్లేష్, పులి కల్పనలు శుక్రవారం ఆ కుటుంబాన్ని కలవనున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ జిల్లా కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేస్తామని సభ్యులు బత్తుల రాంప్రసాద్ తెలిపారు. ఇలాంటి ఘటనలు నగరంలో గతేడాది ఇదే మలక్ పేట ప్రాంతంలో జరిగాయని, మైనర్ బాలికపై, రెండేండ్ల క్రితం ఆదర్శనగర్‌లో, ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌లో చోటు చేసుకోవడం పోలీసులు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం అన్నారు.
Tags: SC, ST Atrocity, Chaderghat, Rape case, victim family, DVMC