‘బయటకు రావొద్దు’

by Sridhar Babu |

దిశ, రంగారెడ్డి: కరోనా నియంత్రణకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనీ, అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. జిల్లాలోని నందిగామ మండలం చేగురు గ్రామం నుంచి క్వారంటైన్‌కు తరలించిన వారిలో 17 మంది డిశ్చార్జీ అయ్యారు. ఈ నేపథ్యంలో చేగూరును కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి, డిశ్చార్జీ అయిన వ్యక్తితో మాట్లాడారు. మరో 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉండాలని సూచించారు. అలాగే, క్వారంటైన్‌లో భోజన వసతుల గురించి ఆరాదీశారు. క్వారంటైన్ నుంచి విడుదలైన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందునాయక్ తదితర వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితుల గురించి సర్పంచ్ విఠల్‌ను అడిగారు. గ్రామస్థులంతా పరిశుభ్రతను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags: rangareddy collector, amoy kumar, released from quarantine, cheguru, nandigama, corona, virus, covid 19, lockdown

Advertisement

Next Story

Most Viewed