- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘డెవిల్’.. ‘యానిమల్’గా మారిందా?
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మార్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి అక్కడా కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ తన స్పెల్ బౌండింగ్ యాక్టింగ్‌తో విమర్శకులను మెప్పించగా, సందీప్ రెడ్డి బీటౌన్‌లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దాంతో అక్కడే పాగా వేయాలని భావిస్తున్న సందీప్.. తన రెండో ప్రాజెక్ట్‌ను రణ్‌బీర్‌తో చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు తొలుత ‘డెవిల్’ అనే టైటిల్ అనుకోగా, ఇప్పుడు అది మార్చేసినట్లు సమాచారం.
సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రస్టిక్, గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా కాగా, దీనికి కథానుసారంగా ‘డెవిల్’ అనే పేరు ఖరారు చేసింది ఫిల్మ్ యూనిట్. అయితే నిర్మాత సాజిద్ నదియావాలా తన ‘కిక్’ సినిమాకు సీక్వెల్‌గా సల్మాన్ ఖాన్‌తో తీయబోయే చిత్రం కోసం ‘డెవిల్’ పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. దాంతో సందీప్ రెడ్డి వంగ అండ్ టీమ్ ఆ సినిమా పేరును ‘యానిమల్’గా మార్చినట్లు బీటౌన్ టాక్. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘బ్రహ్మస్త్ర, షంషీరా’ చిత్రాలతో బిజీగా ఉండగా, ఈ సినిమాలు పూర్తయిన తర్వాత సందీప్ టీమ్‌తో జాయిన్ కానున్నాడు. ఈ చిత్ర కథా చర్చల కోసం రణబీర్ కపూర్ ఇటీవలే సందీప్‌తో పాటు చిత్ర నిర్మాతలైన భూషణ్ కుమార్, మురాద్ ఖేతానితో చర్చలు జరిపాడు.