- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటలు రాని మహా విషాదం: రామోజీ
X
దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలు ఇక లేరంటేనే ఎంతో బాధగా, దిగులుగా, మనస్సు మెలిపెట్టినట్టు ఉందని రామోజీ గ్రూపుల అధినేత రామోజీ రావు అన్నారు. ఆయన గంధర్వ గాయకుడే కాదన్న రామోజీ రావు.. తనకు అత్యంత ఆత్మీయులు.. గుండెలకు హత్తుకొని ప్రేమగా పలకరించే తమ్ముడు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు జాతికే కాకుండా.. ప్రపంచ సంగీతానికే ఎస్పీ బాలు స్వరం ఓ వరమన్నారు.
50 సంవత్సారాల ఎస్పీ బాలు సినీ ప్రయాణంలో జాలు వారని వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు అంటూ కొనియాడారు. బాలుని తలచుకుంటే ఈ క్షణంలో వచ్చేవి కన్నీటి జలపాతాలే అంటూ రామోజీ రావు విచారం వ్యక్తం చేశారు. ‘ మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదం ఇది’ బాలు మీకిదే మా అందరి అశ్రుతర్పణం అంటూ రామోజీ రావు నివాళులు అర్పించారు.
Advertisement
Next Story