- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గేల్‌వన్నీ తప్పుడు ఆరోపణలు : శర్వాణ్
దిశ, స్పోర్ట్స్: కరీబియన్ క్రికెట్ లీగ్‌లోని జమైకా తలవాస్ జట్టులో లుకలుకలన్నీ కొన్ని రోజులుగా బయటపడుతున్నాయి. అసిస్టెంట్ కోచ్ రామ్ నరేష్ శర్వాణ్‌పై జట్టు సభ్యుడు క్రిస్ గేల్ ఆరోపణలు చేయడం, ఆ వెంటనే మరో ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఏకంగా యాజమాన్యంపై ధ్వజమెత్తడంతో ఆ జట్టులో నెలకొన్న విభేదాలు బయటకు వచ్చాయి. ‘తనను జట్టు నుంచి తప్పించడానికి శర్వాణే కారణమని, అతడు కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తని’ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, గేల్ వ్యాఖ్యలపై రామ్ నరేష్ శర్వాణ్ స్పందించాడు. ‘గేల్‌ను ఎంతో ప్రతిభావంతుడిగా, స్నేహితుడిగా ఎంతో గౌరవించానని.. అలాంటిది తనపైనే ఆరోపణలు చేయడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని’ శర్వా అన్నాడు.
తలవాస్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో తన ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పాడు. గేల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని శర్వాణ్ మండిపడ్డాడు. మరోవైపు తలవాస్ యాజమాన్యం కూడా గేల్‌ను తప్పించడంపై స్పందించింది. అతడికి ఉద్వాసన పలకడంలో అసిస్టెంట్ కోచ్ శర్వాణ్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. ఒక ఆటగాడి విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ యాజమాన్యానికి ఉంటుందని అభిప్రాయపడింది.
Tags : Chris Gayle, Jamaica Tallawahs, CPL, Cricket, Andre Russel, Ramnaresh Sharwan