- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి టాప్ లేపిన రామాయణం!
దిశ, వెబ్ డెస్క్: భారతీయ టీవీ ప్రేక్షకులకు రామాయణ ఇతిహాసాన్ని ఎంతో అద్భుతంగా చూపించింది ‘రామాయణ్’. వాల్మీకి రామాయణం, తులసీదాస్ ‘రామ్ చరిత్ మానస్’ ఆధారంగా రామానంద్ సాగర్ ఈ సీరియల్‌ను రూపొందించారు.1987, జనవరి 25న దూరదర్శన్ చానల్‌లో ప్రారంభమైన రామాయణం సీరియల్.. 78 ఎపిసోడ్లుగా ప్రసారమై 1988 జూలై 31తో ముగిసింది. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకుల చూసిన ‘మైథలాజికల్’ టీవీ సీరియల్ ఇదే కావడం విశేషం. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు.. లాక్‌డౌన్ టైమ్‌లో రామాయణం’ సీరియల్‌ను పున:ప్రసారం చేశారు. ఆ టైమ్‌లో రికార్డు సృష్టించిన ఈ సీరియల్.. ఇప్పుడు మరో చానల్‌లో ప్రసారం కాగా, మరోసారి రికార్డును సొంతం చేసుకుంది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం.. ప్రస్తుతం దంగల్ అనే చానల్‌లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఆగస్టు 1 నుంచి 7 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్‌పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకుపోతోందని పేర్కొంది. కాగా, జీ టీవీలో ప్రసారమవుతున్న ‘కుండలి భాగ్య’ సీరియల్ రెండో స్థానంలో, ‘మహిమా శనిదేవ్ కీ’ మూడో స్థానంలో, దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానంలో నిలిచాయి.
లాక్‌డౌన్ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో రామాయణాన్ని రీ టెలికాస్ట్ చేశారు. ఆ రోజు ఉదయం ప్రసారమైన రామాయణం సీరియల్‌ను 3.40 కోట్ల మంది చూడగా, సాయంత్రం ఎపిసోడ్‌ను 4.50 కోట్ల మంది చూశారు. మరుసటి రోజు ఉదయం 4 కోట్ల మంది, సాయంత్రం ఎపిసోడ్‌ను 5.10 కోట్ల మంది చూడడం విశేషం. గత కొన్నేళ్లుగా ప్రసారవుతున్న సీరియల్స్‌లో ఈ స్థాయి ఆదరణ రామాయణానికే దక్కడం గమనార్హం. ఇక ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ఈ సీరియల్‌ను వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్ నిలిచింది.