ఆమెలో ఏ పార్ట్ చూస్తున్నావ్ వర్మ.. చిన్నపిల్ల వదిలేయ్..

by Shyam |   ( Updated:2021-06-16 23:25:23.0  )
rgv with ariyana glory
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్. ఈయన ఏం చేసినా వివాదమే.. హిట్టు లేకపోయినా నిత్యం లైమ్ లైట్ లో ఎలా ఉండాలో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. ఒక హీరోయిన్ కి నెట్టింట్లో పబ్లిసిటీ తెప్పించాలన్నా.. డార్క్ లైట్ లో ఉన్న భామలను లైమ్ లైట్ లోకి తేవాలన్నా ఆర్జీవీ కి కొట్టిన పిండి. ఇక ఈయన ట్విట్టర్ లో వేసిన ఏ ట్వీట్ అయినా అది సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. తాజాగా వర్మ కళ్లు బిగ్ బాస్ బ్యూటీ అరియానాపై పడిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్జీవీ ని ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా స్టార్ గా మారిపోయిన అమ్మడు బిగ్ బాస్ షో కి వెళ్లి స్టార్ స్టేటస్ తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా అమ్మడి రేంజ్ ని పెంచే విధంగా గట్టి ప్రయత్నాలే చేస్తూ కనిపించాడు ఆర్జీవీ.

ariyana glory

ఇక ఇప్పటికే హద్దుమీరిన శృంగార సన్నివేశాలతో గతి తప్పిన సినిమాలతో వర్మ ఇమేజ్ అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు నైనా గంగూలీ జపం చేసిన వర్మ ప్రస్తుతం అరియనా గ్లోరీ నామాస్మరణం చేస్తున్నాడు. ఇటీవల తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అరియానాతో జిమ్ చేయించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. అరియనా అందాలను పొగిడేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల్లో అరియానా నడుమందం నాభిపైన వర్మ కన్ను పడడంతో అది యూత్ లో హాట్ డిబేట్ గా మారింది.

ఇక పలు యాంగిల్స్ లో అరియనా అందాలను జూమ్ చేసి మరి చూపించాడు. దీంతో వీరు ఏ పబ్లిసిటీ అయితే కోరుకున్నారో అది దక్కిందనే చెప్పాలి. #అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ # అరియానాబోల్డ్ఆర్జీవీ #అరియానాగ్లోరీ అంటూ హ్యాష్ ట్యాగులు వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు కూడా అంతే హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఏదిఏమైనా పుడితే.. ఆర్జీవీ గానే పుట్టాలి అని కొందరు.. అరియనా.. చిన్నపిల్ల వదిలేయ్ వర్మ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వర్మ వలనే అరియనా గ్లోరీ ఇంత స్టార్ హోదా సంపాదించిందనే చెప్పాలి. మరి ఈ హాట్ భామా అందాలను వర్మ తన సినిమాలో చూపిస్తాడా..? లేక ఆర్జీవీ జూమింగ్ తో అరియానాకు ఇండస్ట్రీలో ప్రాధాన్యత పెరుగుతుందా అనేది తెలియాలి.

Advertisement

Next Story