వరంగల్ టూర్‌లో RGV.. రాజకీయ నేత ఫ్యామిలీపై కన్నేశారా.!

by Anukaran |   ( Updated:2021-09-23 02:36:29.0  )
వరంగల్ టూర్‌లో RGV.. రాజకీయ నేత ఫ్యామిలీపై కన్నేశారా.!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్జీవీ.. ఈ పేరు అంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అని అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఇప్పుడు మాత్రం.. ఆయన సినిమాలు కంటే.. ఆయన చేసే రచ్చ ఎక్కువ ఫేమస్ అవుతోంది. అవే జనాల నోళ్ళల్లో నానుతుంటాయి.

అయితే ఇప్పటికే అనేక వివాదాస్పద బయోపిక్‌లతో సంచలనాలు సృష్టించిన ఆయన.. తాజాగా కొండా సురేఖ-మురళిలపై బయోపిక్ తీయనున్నట్టు తెలుస్తోంది. వీరి బయోపిక్ కోసం వర్మ వరంగల్‌లో సీక్రెట్‌గా పర్యటిస్తున్నారు. ఈ చిత్రం కోసం వర్మ.. కొండా దంపతుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం.

ఇందుకోసం వరంగల్‌లోని LB కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి కొండా దంపతుల బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వర్మ పలు వెబ్ సీరిస్‌లతో బిజీ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed