ఈడీ అధికారుల కన్న ముందే కార్యాలయానికి చేరుకున్న రకుల్.. ఎందుకంటే ?

by Shyam |   ( Updated:2021-09-02 23:47:31.0  )
ఈడీ అధికారుల కన్న ముందే కార్యాలయానికి చేరుకున్న రకుల్.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు చార్మి, పూరి జగన్నాథ్‌ను విచారించారు. అయితే ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు రకుల్ గంటన్నర ముందే హాజరయ్యారు. గంటన్నర ముందే రకుల్ ఈడీ ఆఫీస్ కు వెళ్లింది. అయితే ఈడీ అధికారుల కంటే ముందే రకుల్ కార్యాలయానికి చేరుకోవడం గమనార్హం.

ఈరోజు ఉదయం 10:30కి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. కానీ రకుల్ మాత్రం ఉదయం 9:10కి ఈడీ కార్యాలయానికి చేరుకోవడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. రకుల్ తో పాటు ఒక న్యాయవాది, రకుల్ మేనేజర్, రకుల్ సీఎ కూడా విచారణకు వచ్చారు. హైదరాబాద్‌, ముంబై డ్రగ్‌ మాఫియాతో ఉన్న ఆధారాలు చూపి ఈడీ రకుల్‌ను ప్రశ్నించనుంది. బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఇక ఈ అమ్మ‌డిని ఎన్ని గంట‌ల పాటు ఈడీ అధికారులు విచారిస్తారు. ఏయే విష‌యాల‌పై ఆమెను ప్ర‌శ్నించ‌నున్నారు అనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Advertisement

Next Story