శివ కార్తీకేయన్‌ ఇంగ్లిష్‌లో బెస్ట్ :రకుల్

by Shyam |   ( Updated:2021-01-19 03:47:04.0  )
శివ కార్తీకేయన్‌ ఇంగ్లిష్‌లో బెస్ట్ :రకుల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా గడిపేస్తోంది. టాలీవుడ్‌లో క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన భామ.. ఆ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మేడే’ చిత్రీకరణలో పాల్గొంది. ప్రజెంట్ కోలీవుడ్ మూవీ ‘అలయాన్’ షూటింగ్‌లో ఉన్నట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది.

మరో మూడు రోజుల షూటింగ్‌తో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కానుందన్న భామ… హీరో శివ కార్తీకేయన్, డైరెక్టర్ రవికుమార్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. శివకార్తీకేయన్‌కు స్వీటెస్ట్ కోస్టార్‌గా కాంప్లిమెంట్ ఇచ్చిన హీరోయిన్‌కు రిప్లై ఇచ్చిన హీరో.. రకుల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. సెట్‌లో ఉన్న టైమ్‌లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడించినందుకు థాంక్స్ చెప్పాడు. తను మాట్లాడేది బ్రిటీష్ ఇంగ్లిష్‌ అయి ఉంటుందని కామెడీ చేస్తూ ట్వీట్ చేసిన శివ కార్తీకేయన్‌కు ‘లేదు లేదు బెస్ట్ ఇంగ్లిష్‌’ అని సమాధానమిచ్చింది రకుల్.

https://twitter.com/Siva_Kartikeyan/status/1351412247612977152?s=20

Advertisement

Next Story