సముద్రం అడుగున రాక్షస బొద్దింక

by Harish |
సముద్రం అడుగున రాక్షస బొద్దింక
X

మహాసముద్ర లోతుల్లో ఒక కొత్త రాకాసి కీటకం కనిపించింది. అదొక బొద్దింక. అవి ఇంట్లో కదా ఉండేది.. సముద్రాల్లో ఏం చేస్తున్నాయని అనుకోవద్దు. ఇదొక బొద్దింకలా కనిపిస్తున్న సముద్రజీవి. సింగపూర్‌కు చెందిన కొందరు పరిశోధకులు బాంటన్‌లో హిందూ మహాసముద్ర లోతులను పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇండోనేషియాకు పశ్చిమంగా ఉన్న జావా వద్ద ఒక వింత జీవి కనిపించింది. 2018లో కనిపించిన ఈ జీవి మీద మొన్నటివరకు పరిశోధనలు చేసి, అదొక కొత్త జీవి అని తెలుసుకున్నారు. ముఖం మీద ముసుగుతో ఉన్న ఈ జీవికి ‘బాథైనోమస్ రాక్షస’ అని పేరు కూడా పెట్టారు. దీన్ని ముద్దుగా ‘కాక్రోచ్ ఆఫ్ ది సీ’ అంటే సముద్రపు బొద్దింక అని కూడా పిలుస్తున్నారు.

ఇండోనేషియా నుంచి మొదటగా గుర్తించిన క్రస్టేసియా జాతి జీవి ఇదే, అలాగే పెద్దగా ఉంది కాబట్టి దీనికి ‘రాక్షస’ అని పేరులో జోడించారు. రాక్షస అంటే ఇండోనేషియన్ల భాషలో భారీగా ఉండేదని అర్థం. దీని గురించిన పూర్తి వివరాలను పరిశోధకులు.. జూకీస్ పరిశోధక జీవవైవిధ్య జర్నల్‌లో ప్రచురించారు. కాగా, త్వరలోనే లోతుగా అధ్యయనం చేస్తామని పరిశోధకులు కానీ ఎమ్ సైడాబాలోక్, హెలెన్ పీ ఎస్ వాంగ్ తెలిపారు. మహాసముద్ర అడుగున చల్లగా ఉండే ప్రాంతాల్లో ఈ జీవి పెరుగుతుందని.. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోనూ ఇవి ఉండొచ్చని వారంటున్నారు. మొత్తం 14 కాళ్లు ఉన్నప్పటికీ కేవలం ముందు రెండింటితోనే సముద్రం అడుగున నేల మీద తిరుగుతుందని చెప్పారు. 50 సెం.మీ. పొడవు పెరిగిన ఈ జీవి, ఇప్పటివరకు కనిపెట్టిన పెద్ద కీటక జాతి జీవుల్లో ఆరో స్థానంలో ఉందని వారు జర్నల్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story