ఐటమ్ గర్ల్ అయినందుకు బాధ లేదు : రాఖీ సావంత్

by Jakkula Samataha |
ఐటమ్ గర్ల్ అయినందుకు బాధ లేదు : రాఖీ సావంత్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో ‘మొహబత్ హై మిర్చి, దేక్తా హై తు క్యా’ వంటి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ సావంత్.. తనను ఐటమ్ గర్ల్ అని పిలవడం పట్ల ఎలాంటి రీగ్రెట్స్ లేవని చెప్పింది. అయినా తనకు హీరోయిన్ పాత్రలు పోషించేంత టాలెంట్ లేదంటూ అభిప్రాయన్ని వ్యక్తం చేసింది. తాజాగా రేడియో హోస్ట్‌ సిద్దార్థ్ కన్నన్‌తో లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాఖీ..‘బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరు హీరోయిన్ కాలేరు. కొందరికి ఐటమ్ గర్ల్ చాన్సులొస్తే.. మరికొందరికి తల్లి, చెల్లి పాత్రలు లేదంటే నెగెటివ్ రోల్స్ దక్కుతాయి’ అని వెల్లడించింది.

ఐటమ్స్ సాంగ్స్‌ చేయడం పట్ల తానేమీ బాధపడటం లేదని, వాటితో సంపాదించిన డబ్బుతోనే ఫ్యామిలీని పోషిస్తున్నానన్న రాఖీ.. బాలీవుడ్‌లో తనకు ప్లేస్ దక్కడం పట్ల గౌరవంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ఇక ఐటమ్ సాంగ్స్‌తోనే కాకుండా ‘నాచ్ బలియే, పతి పత్ని ఔర్ వో, జర నాచ్‌కే దిఖా’ వంటి రియాలిటీ షోస్ ద్వారా కూడా రాఖీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘రాఖీ సావంత్ షోస్, రాఖీ కా ఇన్సాఫ్’ వంటి పలు షోస్‌కు హోస్ట్‌గానూ వ్యవహరించింది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed