- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దిశ, వెబ్‌డెస్క్: బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. బీమా(సవరణ) బిల్లు-2021పై జరిగిన చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ప్రస్తుతం బీమా సంస్థలు ఆర్థిక పరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీమా పరిశ్రమలో అధిక విదేశీ పెట్టుబడులతో దేశీయ దీర్ఘకాలిక వనరులను భర్తీ చేయడంతో పాటు దేశీయ బీమా పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని’ చెప్పారు. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వాటాదారులతో సవివరమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నామని సీతారామన్ పేర్కొన్నారు. కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని చివరిసారిగా 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. కాగా, మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తులు జీడీపీలో 3.6 శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోల్స్తే తక్కువ. అదేవిధంగా సాధారణ బీమా ప్రపంచ సగటు 2.88 శాతం ఉండగా, మన దేశంలో ఇది 0.94 శాతం మాత్రమే ఉంది.