- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్కడి నుంచి ప్రైవేట్ జెట్‌లో చెన్నై చేరుకున్న ‘తలైవా’

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ తన వయసు, ఆరోగ్యం దృష్ట్యా పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో కొనసాగిన లాంగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన రజనీ.. ఈ రోజు ఓ ప్రైవెట్ జెట్‌లో చెన్నైకి బయలుదేరిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో తలైవా వైట్ కుర్తా ధరించి ఉన్నారు.
కాగా ‘అన్నాత్తే’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న నయనతార ఇటీవలే రజనీకాంత్‌తో కలిసి హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొంది. ఇక ప్రస్తుతం చెన్నై చేరుకున్న ఈ సూపర్‌స్టార్ డబ్బింగ్ పూర్తిచేసి, వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్, జాకీ ష్రాఫ్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తుండటం విశేషం.